నా పెళ్లి నా కుటుంబంలో వారికి ఇష్టం లేదు – కాజల్ అగర్వాల్!

ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టి చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది .ఆ తర్వాత అందరి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి మిత్రుడు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఇక మరుసటి ఏడాదే ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్ళీ పూర్వ ఫిట్నెస్ ను పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ మళ్లీ తన ఫిగర్ మెయింటైన్ చేసే పనిలో పడ్డ ఈ ముద్దుగుమ్మ మరింత అందంగా మారిందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ మధ్యనే ఆమె రెండోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు బాగా వైరల్ అవుతుంది.ఈ నేపథ్యంలో ఈ విషయాలను కూడా ఆమె కొట్టిపారేసింది. ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఒకటి కమలహాసన్ సరసన ఇండియన్ 2, మరొకటి బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. ఇంకొకటి తమిళ్లో సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుండగా ఇంకొక వైపు కార్తీక అనే సినిమాని కూడా ఇటీవల రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలపై షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన భర్త గౌతమ్ అంటే తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు అని తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. గౌతమ్ నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమై.. మంచి స్నేహితులగా మారాము. మా ఫ్రెండ్షిప్ ఏడేళ్లు కొనసాగింది. అతని వ్యక్తిత్వం బాగా నచ్చింది. ఒకరికొకరు ఇష్టపడ్డాము కానీ చెప్పుకోలేదు. ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయినప్పుడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో చెబితే అమ్మ ఒప్పుకుంది కానీ నాన్న ఒప్పుకోలేదు. మా ఇద్దరి వృత్తులు వేరువేరు కావడం వల్ల ఆయన అడ్డు చెప్పారు. కానీ ప్రస్తుతం నాన్న గౌతమ్ తోనే ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు అంటూ తెలిపింది.