క్లిన్ కారా ఎవ‌రి పోలికో చెప్పేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. అచ్చం ఆ వ్య‌క్తిలానే ఉంటుంద‌ట‌!

క్లిన్ కారా.. ఈ మెగా లిటిల్ ప్రెన్సెస్ పుట్టి నెల‌న్న‌ర కూడా కాలేదు. కానీ, టాలీవుడ్ లో ఈ క్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పెళ్లైన 11 ఏళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అయ్యారు. గ‌త నెల అపోలో హాస్ప‌ట‌ల్ లో ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

అలాగే త‌మ బిడ్డ‌కు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు క్లిన్ కారా అంటూ నామ‌క‌ర‌ణం చేసేశారు. కానీ, ఇంత‌వ‌ర‌కు క్లిన్ కారా పిక్స్ బ‌య‌ట‌కు రానివ్వ‌లేదు. ఉపాస‌న డిశ్చార్జ్ స‌మ‌యంలో క్లిన్ కారా ఎవ‌రి పోలికి అని ప్ర‌శ్నిస్తే.. అన్ని తండ్రి పోలిక‌లే అంటూ రామ్ చ‌ర‌ణ్ న‌వ్వేశాడు. తాజాగా మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క్లిన్ కారా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `బ్రో` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన ఈ మెగా మల్టీస్టార‌ర్ మ‌రో మూడు రోజుల్లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తేజ్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. క్లిన్ కారా గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. క్లిన్ కారా చాలా క్యూట్ గా ఉంటుంద‌ని, ఆమె రామ్ చ‌ర‌ణ్ పోలిక‌లు వ‌చ్చాయ‌ని, అచ్చం తండ్రిలానే ఉంటుంద‌ని, తండ్రి పోలిక‌ల‌తో కూతురు పుడితే అదృష్ట‌మ‌ని తేజ్ పేర్కొన్నాడు. అంతేకాదు, క్లిన్ కారా క‌ళ్లు ఎంతో బాగుంటాయ‌ని.. ఆమెలో త‌న‌కు న‌చ్చిన‌వి అవే అని తేజ్ వెల్ల‌డించాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.