వాచ్ మెన్ కుటుంబానికి సహాయం చేసిన జబర్దస్త్ వర్ష..

దేశంలో చాలామంది దగ్గర అవసరానికి మించి ఎక్కువగా డబ్బులు ఉంటుంటాయి. అయితే ఎంత డబ్బు ఉన్న కూడా ఎదుటివాడికి కష్టం వస్తే సహాయం చేయటానికి ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటివాడి కష్టాన్ని తెలుసుకొని సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా కష్టం లో సహాయం చేసే చాలా తక్కువ మందిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష ఆమె చేసిన సేవ కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చింది. సీరియల్స్, సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన వర్ష జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.

జబర్దస్త్ షో అందరి అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతోపాటు, మంచి రైటింగ్ను కూడా సొంతం చేసుకుంది. అలాంటి జబర్దస్త్ కామెడీ షో లో వర్ష, ఇమ్మాన్యుయెల్ కి జోడిగా బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ జోడికి బాగా ఫ్యాన్స్  ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే . అలా బాగా పాపులర్ అయిన వర్ష రాబోయే బిగ్ బాస్ సీజన్7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.  ఇక ఈ రియాలిటీ షో తర్వాత వర్ష కెరీర్ ఒక మలుపు తిరుగుతుందని చెప్పడంలో ఆశ్చర్యం అవసరం లేదు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో వర్ష మాట్లాడుతూ’ మా వాచ్మెన్ కి ఇద్దరు కొడుకులు. వారిద్దరిని చదివించడానికి వాచ్మెన్ కి స్థోమత లేదు. దాంతో ఒక కొడుకుని మాత్రమే చదివిస్తున్నాడు. అది తెలిసి ఎంత ఖర్చైనా మరో కొడుకుని నేను చదివిస్తాను అని వాచ్మెన్ కి మాటిచ్చాను. అతనికి ఇచ్చిన మాట ప్రకారం అతని కొడుకును చదివిస్తున్నాను కూడా ‘ అంటూ వర్ష చెప్పుకొచ్చింది. అలానే అల్లు అర్జున్ కి లవర్ గా నటించాలని ఉంది, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సిస్టర్ గా నటించాలని కోరిక ఉంది అని వర్ష కామెంట్స్ చేసింది. ఇక వర్షం బిగ్ బాస్ 7 విన్నర్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.