మా బంధం విడిపోనిది… విజయశాంతి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ విజయశాంతి. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది విజయశాంతి. విజయశాంతి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా రాణించింది. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది విజయశాంతి. విజయశాంతి కెరియర్ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలలో సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.

Vijayashanti lashes out at CM KCR

తాజాగా విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఈ వీడియోలో విజయశాంతి ఇలా రాసుకుంటూ.. నా దూకుడు పోరాటం ఎప్పుడు అభిమానులే ఈ వీడియో దృష్ట ఇది కళాకారునిగా నాకు మీరు అందించిన జన్మ బంధం వరం ఎప్పటికీ ఈ బంధాన్ని విడిచిపెట్టను గౌరవంగా కాపాడుకోవడం నా బాధ్యత అంటూ నాకు ఎప్పటికీ స్ఫూర్తి పూర్వకం మీ రాములమ్మ అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది విజయశాంతి..

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ట్విట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ పోస్ట్ ను చూసిన అభిమానుల సైతం పలు రకాల కామెంట్లతో విజయశాంతిని పొగిడేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈమె పైన ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ చేస్తున్నారు విజయశాంతి అభిమానులు. సరిలేరు నీకెవరు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన విజయశాంతి ఆ తర్వాత మళ్లీ ఎలాంటి చిత్రాన్ని కూడా అంగీకరించలేదు. కేవలం తన ఫోకస్ రాజకీయాలపైనే ఉంచినట్టుగా తెలుస్తోంది.