జెంటిల్‌మేన్ లా క‌నిపించే చైతు ఇంత ముదురా.. పెళ్లికి ముందే ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో..?

అక్కినేని నాగ‌చైత‌న్య గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చైతు.. కెరీర్ ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డ్డా ఆ త‌ర్వాత హీరోగా బాగానే నిల‌దొక్కుకున్నాడు. ప్ర‌స్తుతం హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. నాగ‌చైత‌న్య ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. 2017లో స‌మంత‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి త‌ర్వాత ఎంతో అన్యోన్యంగా క‌నిపించినా.. వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగ‌లేదు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అయితే పైకి జెంటిల్‌మేన్ లా క‌నిపించినా చైతు చాలా ముదుర‌ట. స‌మంత‌తో పెళ్లికి ముందు ఈ అక్కినేని బుల్లోడు ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ న‌డిపించాడ‌ట‌. అందులో ఒక‌రు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. నాగ‌చైత‌న్య, కాజ‌ల్ 2011లో విడుద‌లైన `ద‌డ‌` మూవీ కోసం వ‌ర్క్ చేశారు.

అయితే ఆ స‌మ‌యంలో ఏర్ప‌డ్డ ప‌రిచ‌య‌మే.. చైతు, కాజ‌ల్ మ‌ధ్య ప్రేమ‌గా మారింద‌ని అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. వారు తరచుగా ఈవెంట్లలో కలిసి కనిపించ‌డంతో ప్ర‌చారం బ‌ల‌ప‌డింది. కానీ, కాజ‌ల్ మ‌రియు చైతు ఎప్పుడూ ఈ విష‌యంపై ఎప్పుడూ స్పందించ‌లేదు. కొన్నాళ్ల త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, శృతి హాస‌న్ మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. 2016లో విడుద‌లైన ప్రేమ‌మ్ మూవీలో వీరిద్ద‌రూ న‌టించారు. అప్ప‌ట్లో చైతు, శృతి పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. వీటిని సైతం చైతు ఖండించ‌లేదు మ‌రియు ధృవీకరించలేదు. ఇక స‌మంత‌తో విడిపోయిన త‌ర్వాత శోభిత‌తో చైతు డేటింగ్ చేస్తున్నాడన్న టాక్ ఉంది.