ఆ పేరే పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటూ రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్.

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ‘జైలర్’ అనే సినిమా లో నటించారు. సెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన మిల్క్ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించింది. జైలర్ సినిమా ఆగెస్టు 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా
జైలర్ సినిమా కి సంబందించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ ను చెన్నై లో ఘనంగా నిర్వహించారు మూవీ టీమ్.

ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రజినీకాంత్ కి ఉన్న ‘సూపర్ స్టార్’ అనే బిరుదు కారణంగా ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది అని తెలిపారు. ఆయన నటించిన జైలర్ సినిమాలోని ‘హుకుమ్’ అనే పాట రజినీ కి చాలా ఇష్టమట. అందుకే ఆ పాట నుండి సూపర్ స్టార్ ట్యాగ్ నుండి తొలగించాల్సిందిగా మేకర్స్ ని ఆయన కోరినట్లు కూడా రజినీ చెప్పారు. సూపర్ స్టార్  ట్యాగ్ వచిన్నప్పటినుంచి ఇబ్బంది పెడుతుంది అని ఆయన అంటున్నారు. నిజానికి 1977 నుండి సూపర్ స్టార్ వివాదం నడుస్తూనే ఉంది. అప్పట్లో ఉన్న శివాజీ గణేషన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలకు ఆ బిరుదు ఇవ్వకుండా ఆయనకు ఆ బిరుదు ఎందుకు ఇచ్చారో తెలీదన్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ ఒక స్టోరీ కూడా వినిపించారు. ‘ ఒక అడవిలో కాకి, గ్రద్ధ రెండు ఉంటాయి. కాకి గ్రద్ధ లా ఎగారాలని అనుకుంటుంది. కానీ గ్రద్ధ ఎగిరినంత ఎత్తుకు కాకి ఎప్పటికి ఎగరలేదు ‘అంటూ ఒక ఉదాహరణ ను చెప్పారు. అలానే చాలా మంది హీరోలు స్టార్ లు అయ్యాం అని అనుకుంటున్నారు కానీ దానిని తీసుకోడమే కాదు నిలబెట్టుకోవాలి కూడా అని రజినీ అన్నారు. ఇక జైలర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, తమన్న తదితరులు హాజరయ్యారు.