తమన్నా పాటకు చిందులేస్తున్న రమ్యకృష్ణ.. వీడియో వైరల్..!!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండీగా వినిపిస్తున్న పాట తమన్నా వేసిన జైలర్ చిత్రంలోని నువ్వు కావాలయ్యా అనే సాంగ్.. ఈ పాట నెట్టింట ఎక్కడ చూసినా చెక్కర్లు కొడుతూ కనిపిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలోని ఈ సాంగ్ మంచి పాపులారిటీ సంపాదించింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Ramya Krishnan grooves to Tamannaah Bhatia's Kaavaalaa in vanity before the  Jailer audio launch; VIDEO | PINKVILLA

ఈ సినిమా ఆగస్టు పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఇందులో అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ, సునీల్ ,యోగి బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఫస్ట్ సింగిల్ పాటని రిలీజ్ చేశారు. తాజాగా ఈ రోజున సెకండ్ పాటను కూడా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.. రమ్యకృష్ణ కూడా నువ్వు కావాలయ్యా అనే పాటకు ఎనజిటిక్ స్టెప్పులు వేసి మరింత హైలైట్ గా చేస్తోంది. తన వ్యానిటీ వ్యాన్లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ వేయడం జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన అభిమానుల సైతం ఒకసారిగా అవాక్కవుతున్నారు.. 52 ఏళ్ళ వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్తో రమ్యకృష్ణ డాన్స్ వేయడంతో నమ్మలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతో గ్లామర్ పర్ఫెక్ట్ లుక్స్ తో రమ్యకృష్ణ కనిపిస్తోందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమన్నాతో కలిసి రజనీకాంత్ ఈ పాటలో సిగ్నేచర్ స్టెప్పులు వేయడం జరిగింది.