ఈ ఫోటోలో క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌!

పైన ఫోటోలో చీర క‌ట్టుకుని రెండు పిల‌క‌లు వేసుకుని క్యూట్ గా క‌నిపిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? సౌత్ లోనే ఆమె స్టార్ హీరోయిన్‌. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ బ్యూటీకి భారీ ఫాలోయింగ్ ఉంది.

గుర్తు ప‌ట్టారా..? లేదా..? ఆమె గురించి ఇంకా చెప్పాలంటే డాక్ట‌ర్ చ‌దివి యాక్ట‌ర్ అయింది. ఎలాంటి ఎక్స్‌పోజింగ్ చేయ‌కుండా న‌ట‌నా ప్ర‌ధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌తోనే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటుంది. ఆమెను లేడీ ప‌వ‌ర్ స్టార్ అని కూడా అంటారు. ఈపాటికే ఆమె ఎవ‌రో అర్థ‌మైపోయుంటుంది. అవును, ఆమె సాయి ప‌ల్ల‌వి.

సాయి ప‌ల్ల‌వి చిన్న‌నాటి ఫోటో ఇది. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే గ్రామంలో జన్మించింది. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు. దీంతో ఆమె పేరులో సాయిని చేర్చారు. కోయంబత్తూర్ లో పాఠశాల విద్యపూర్తి చేసిన ఈమె ఆ తరువాత జార్జియా కళాశాలలో డాక్టర్ కోర్స్ చేశారు. ఆపై న‌ట‌నపై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ మ‌ధ్య సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసిన సాయి ప‌ల్ల‌వి.. వెకేష‌న్స్ లోనే ఎక్కువ‌గా ఉంటోంది. రీసెంట్ గా ఫ్యామిలీతో క‌లిసి అమర్ నాథ్ యాత్ర కు వెళ్లింది. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌వి కోలీవుడ్ లో క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో శివ‌కార్తికేయ‌న్ కు జోడీగా ఒకే ఒక సినిమా చేస్తోంది.