అడివి శేషు కొత్త అవతారం.. హైప్స్ పెరిగేసాయిగా..

ప్రముఖ నటుడు అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అండ్ టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అడవి శేషు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే అడవి శేషు కేవలం నటుడు మాత్రమే కాదు రైటర్ కూడా అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన గతంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ చేశాడు. కానీ అవేమీ విజయం సాధించలేకపోయాయి.

దాంతో డైరెక్షన్ ని వదిలిపెట్టి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ మంచి కథలను ఎంచుకొని ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. హీరోగా మంచి సక్సెస్ అందుకుంటున్న సమయంలో అడవి శేషు దాదాపు 10 ఏళ్ల క్రితం వదిలేసిన డైరెక్షన్ లోకి మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాడట. ఇప్పటికే హీరోగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ డైరెక్టర్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. మరి అతను హిట్స్ అందుకున్న సినిమా ల ద్వారా ఎంతోకొంత అనుభవం సంపాదించుకొని మళ్ళీ డైరెక్టర్ గా అవతారమెతబోతున్నాడు శేషు.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి ఒక భారీ బడ్జెట్ మూవీ చేయడానికి అడవి శేషు రెడీ అవుతున్నాడట. ‘డికాయిట్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా స్టోరీ ని శశికిరణ్ తిక్క డెవలప్ చేస్తున్నప్పటికీ, అడవి శేషు తానే స్వయంగా ఈ సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అడవి శేషు ఈ సినిమా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ని రెడీ చేసుకున్నాడట. కాబట్టి డైరెక్షన్ కూడా ఆయన చేస్తారని సమాచారం. గతంలో అడవి శేషు డైరెక్ట్ చేసిన కర్మ,కిస్ సినిమాలు రెండు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. మరి ఇన్నేళ్ల తరువాత డైరెక్ట్ చేయబోతున్న ‘డికయిట్ ‘ సినిమా రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి..