వెడ్డింగ్ రూమర్స్ పై ఎట్టకేలకు స్పందించిన ఆ స్టార్ యాక్టర్..

శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి మనందరికీ సుపరిచితురాలే. స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం లో వచ్చిన ‘పిలిస్తే పలుకుతా’ అనే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఈ సినిమా లో షమితా శెట్టి లుక్స్ ప్రేక్షకులని అలరించాయి. ఈ సినిమా బాగానే ఆడింది కానీ ఆ తరువాత షమిత శెట్టి కి అవకాశాలు రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీ నుండి ఈమె కనుమరుగైపోయింది.

గత ఏడాది తన భర్త రాకేష్ బాపత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది షమితా శెట్టి. ఇకనుండి మా దారులు వేరు అంటూ ఇద్దరు విడాకుల విషయం ప్రకటించారు. అయితే షమితా శెట్టి తన భర్తతో విడిపోయి ఏడాది అయిందో లేదో అప్పుడే వేరే వ్యక్తితో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరా అని తెలుసుకోడానికి చాలా మంది ఆతృతగా ఎదురుచూశారు.

షమితా శెట్టి బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో ప్రేమలో ఉంది అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే ఈ విషయం పై అలీ ఇటీవలే స్పందించి అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు. అలీ మాట్లాడుతూ ‘ ఒక స్నేహితుని బర్త్డే సందర్బంగా రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ నా స్నేహితురాలు షమితా కలిసింది. అక్కడ మేముఇద్దరం కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆమెని నేను నా కారు లో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసాను. మేము మంచి స్నేహితులం మాత్రమే. మా మధ్య మీరు అనుకుంటున్నట్లు ఏమి లేదు ‘ అంటూ అమీర్, షమితా ల పై వస్తున్న రూమర్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు.