సలార్ సినిమా నుంచి భారీ అప్డేట్.. టీజర్ టైమ్ డేట్ ఫిక్స్..!!

ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా సలార్… ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఇప్పటివరకు కేవలం రెండు మూడు పోస్టర్లు మాత్రమే తప్ప ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ మాత్రం ప్రకటించలేదు. పైగా ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఫుల్ హోప్స్ మీద సలార్ సినిమా పైనే ఉన్నారు. బాహుబలి సినిమా సీక్వెల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఫ్లాప్ లను ఎదుర్కొన్నారు ప్రభాస్

Salaar BIG update: Teaser of Prabhas and Prashanth Neel's film to release  on July 6; Details inside | PINKVILLA

కలెక్షన్ల పరంగా అయితే సినిమాలు రాబట్టిన ప్రేక్షకులను అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది దీంతో ప్రభాస్ అభిమానులు ఆశలన్నీ సలార్ చిత్రంపైనే పెట్టుకున్నారు.. అవుట్ అండ్ డౌట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించడం జరిగింది.. సలార్ టీజర్ ను జులై ఆరవ తేదీన ఉదయం 5: 12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్తో కూడా విడుదల చేయడం జరిగింది.

ఓం భలే బ్యానర్ పైన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారిన్ విధంగా నటించబోతున్నారు. అలాగే జగపతి బాబు కూడా ఇందులో కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల బడ్జెట్ తో సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు టీజర్ అభిమానులను అలరించి ఆకట్టుకుంటుందో చూడాలి.