వార్ 2లో పెరుగుతున్న హీరోలు..ఎన్టిఆర్ తో పాటు మరో ముగ్గురు స్టార్లు..!

బాలీవుడ్ లో ఇప్పుడు రాబోయే సినిమాల్లో వార్ 2 సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి. వార్ 2 ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలని మొదలయాయ్యి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని తెలుగు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. దానికి కారణం ఎవరో కూడా అందరికి తెలుసు. జూనియర్ ఎన్టిఆర్. వార్ 2 సినిమాలో ఎన్టిఆర్ కూడా ఉన్నారని అధికారిగానే ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబోలో ”వార్ 2 సినిమా వస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమలో ఎన్టిఆర్, హృతిక్ రోషన్ కాకుండా మరో స్టార్ హీరో కూడా నటించనున్నారని వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటికే ఎన్టిఆర్, హృతిక్ రోషన్ వార్ 2 లో ఉన్నారనే వార్త తెలిసినప్పటి నుంచే ఎన్నో రూమర్లు వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త వినిపిస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు. హీరో సూర్య. అయితే ఈ విషయంపై వార్ 2 టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలను తీసుకున్న మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ హీరోని కూడా ఈ సినిమాలో తేవడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వార్ 2 సినిమా అనేది ద్దరు స్నేహితుల మధ్య ఉంటుందని, అర్జునుడు, కృష్ణుడు లా కలిసి ఉన్న స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు?అనే కోణంలో ఈ కథ ఉంటుందని మాట్లాడుకుంటున్నారు.


అయితే ఎన్టిఆర్ నుంచి ఫుల్ యాక్షన్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఆదిత్య చోప్రా నిర్మించ బోతున్నారు. అయితే నిజంగానే సూర్య ఈ సినిమాలో కనిపించనున్నారా..కనిపిస్తే అన్ని రికార్డులు బద్దలవుతాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరి వార్ 2 టీం ఏం ప్లాన్ చేస్తుందో.