అందాల చంద‌మామ కాజ‌ల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజు అది ఉండాల్సిందే అట‌!

టాలీవుడ్ అందాల చంద‌మామ అంటే గుర్తొచ్చే పేరు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. సుదీర్ఘ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకుని ఒక బిడ్డ‌కు త‌ల్లి కూడా అయింది. కానీ, ఆమె అందం మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అయితే మ‌రి కాజ‌ల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. క‌ఠిన‌మైన డైట్, రెగ్యుల‌ర్‌ జిమ్ వంటివి కానే కాదు.

మార్నింగ్ చిన్న పాటి ఎక్సరసైజులు చేసి.. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటుంద‌ట‌. అలాగే బ్రేక్ ఫాస్ట్ లో ఒకొ జొన్న రొట్టే కర్రీతో పాటు తీసుకుంటుందిట. మధ్నాహ్నం లంచ్ లో, రాత్రి డిన్నర్ లో ఖ‌చ్చితంగా ప‌ప్పు ఉండాల్సిందే అట‌. నిత్యం రెండు పూట‌లా రైస్‌, ప‌ప్పు తింటుంద‌ట‌. ప‌ప్పు కాజ‌ల్ ఫేవ‌రెట్ డిష్ అట‌. ప‌న్నీర్ కూడా చాలా ఇష్టంగా తింటుంద‌ట‌. ప్రోటీన్ షేక్స్, కొబ్బరి నీళ్లు రెగ్యుల‌ర్ గా తీసుకుంటుంది.

అయితే నాన్ వెజ్ ను మాత్రం ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌ద‌ట‌. నాన్ వెజ్ స్మెల్ కూడా కాజ‌ల్ కు ప‌డ‌ద‌ట‌. ఇక చీట్ మీల్ డే రోజు మాత్రం అమ్మ చేసే పరోటాల‌ను క‌నీసం ప‌దైనా లాగించేస్తాన‌ని కాజ‌ల్ స్వ‌యంగా పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా ఉంది. బాల‌కృష్ణ `భ‌గ‌వంత్ కేస‌రి`, క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`తో పాటు స‌త్య‌భామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజ‌ల్ భాగ‌మైంది.