`స‌లార్‌` టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌.. బండ‌బూతులు తిడుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న అట్ట‌హాసంగా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే ఈ సినిమా టీజ‌ర్ కోసం గ‌త కొద్ది నెల‌ల నుంచి ప్ర‌భాస్ ఫ్యాన్స్ క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురుచూస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు స‌లార్ టీజ‌ర్ విడుద‌ల‌కు మేక‌ర్స్ ముహూర్తం పెట్టారు. జూలై 6వ తేదీన స‌లార్ టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ కొద్ది సేప‌టి క్రిత‌మే అనౌన్స్ చేశారు.

ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్ ను బ‌యట‌కు వ‌దిలారు.ఇందులో శ‌త్రువు గుండెలో ఆయుధాన్ని దించుతూ ప్ర‌భాస్ క‌నిపిస్తోన్నాడు. అత‌డి ముఖాన్ని చూపించ‌కుండా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు. అయితే ఈ అనౌన్స్‌మెంట్ తో డార్లింగ్స్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా కొంద‌రు మాత్రం చిత్ర టీమ్ ను బండ‌బూతురు తిడుతున్నారు. ఎందుకంటే, స‌లార్ టీజ‌ర్ ను జూలై 6వ తేదీ తెల్ల‌వారుజామున 5 గంట‌ల 12 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో `అంత పొద్దునే టీజర్ ఎంది రా మెంటెల్ నా కొ**` అంటూ కొంద‌రు ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.