పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. బ్రో మూవీ వాయిదా నేనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా బ్రో ది అవతార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు రెండు పాటలు కూడా విడుదల కావడం జరిగింది. టీజర్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Bro Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

ఈవారం చివరిలో కానీ ఈ నెల 22వ తేదీ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అభిమానులు భావిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈ సినిమాని వాయిదా వేసే ఆలోచనలు దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే కూడా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి ఎడిటింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని రికార్డింగ్ కూడా పూర్తి కాలేదని దీనికి తోడు పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదని సమాచారం. ఇలా పెండింగ్ వర్క్ ఉండడంతో హడావిడిగా ఈ చిత్రాన్ని విడుదల చేసే బదులు కాస్త మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో మెయింటైన్ చేసి విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనలు దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా విడుదల తేదీపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.