అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రాజకీయ ఎంట్రీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే..!!

సినిమా నటులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు .ఇందులో కొంతమంది సక్సెస్ కాక మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇప్పుడు బాలీవుడ్లో తాజాగా అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Amitabh Bachchan, Abhishek, Aishwarya Rai Bachchan and Aaradhya test  positive for Covid-19: Timeline of their road to recovery | The Times of  India

అమితాబచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సమాజ్ వాద్ పార్టీ తరఫున యూపీలోని ప్రయాగ్ రాజ్ లోక సభ స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం.అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన అయితే వెలువడలేదు. సమాజ్ వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ త్వరలోనే ముంబైకి వెళ్లి అక్కడ అమితాబచ్చన్ కలవబోతున్నట్లు రాజ్యసభ సభ్యురాలు జయ బచ్చన్ ను కూడా కలవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అమితాబచ్చన్ 1984లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు ప్రయాగ్ రాజ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆ ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ ఎన్నికలలో అమితాబ్ కు 60 శాతం వరకు ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.అభిషేక్ తల్లి జయ బచ్చన్ కూడా యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతోంది. అభిషేక్ బచ్చన్ ని కూడా ప్రయాగ్ రాజ్ లోక్ సభ నుంచి బరిలోకి దింపాలని పలువురు అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్లీ 1984 లో జరిగిన సీన్ ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.