పాత్ర ఏదైనా అవి ఉండాల్సిందే – నర్గీస్ ఫక్రి బోల్డ్ కామెంట్స్..!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు వివిధ భాష ఇండస్ట్రీలలో కూడా ఓటీటీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న సినిమాలే కాదు కొన్ని పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీ లోకి విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఓటిటిలలో సినిమాలు రావడంతో కుటుంబంతో కలిసి సినిమాను చూడాలనుకునే వారు చాలా మంది థియేటర్లు కి వెళ్లడం మానేస్తున్నారు.విడుదల అయిన రెండు వారాల్లోనే ఓటీటీ లోకి సినిమాలు వస్తుండడంతో ఇక థియేటర్కు వెళ్లడం ఎందుకు దండగా అన్నట్లుగా ప్రేక్షకులు ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం .

ఇదిలా ఉండగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలకు సెన్సార్ కూడా లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్ గా అనిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ కూడా చేసిన ఆసక్తికర బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే ఓటీటిలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్లు పట్ల తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూకి హాజరయింది.ఈ క్రమంలోనే బోల్డ్ కంటెంట్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ లలో బోల్డ్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే నేను దుస్తులు మాత్రం తీసివేయను అంటూ స్పష్టం చేసింది. నాకు నగ్నంగా ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఏ ప్రాజెక్టులో కూడా నేను నగ్నంగా నటించలేను. అలాంటి సీన్స్ చేయవలసి వస్తే ఖచ్చితంగా నేను నా దుస్తులను మాత్రం తీసివేయను.. లెస్బియన్స్ గా నటించడం కూడా నాకు ఇష్టం ఉండదు. అయితే పాత్ర ఏదైనా అది కచ్చితంగా నటనలో ఒక భాగమే.. కానీ ఇలాంటివి మాత్రం నాకు నచ్చవు అంటూ చాలా బోల్డ్ గా కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.