విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్..ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో విడాకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పెళ్ళైన కొన్నేళ్ళకే విడాకులు తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకే విడాకులు అంటూ చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోగా, తాజాగా నిహారిక చైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. అయితే ఇపుడు మరో హీరోయిన్ కూడా విడాకులకు సిద్ధమవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. టాలీవుడ్ లోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకులు అనేది కామన్ అయిపోయింది.

తాజాగా నిహారిక- చైతన్యల పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేసాయి. అయితే పెళ్ళైన కొన్ని రోజులకే వీరు దూరం అయ్యారు. కనీసం రెండుళ్లు కూడా వీళ్ళు కలిసి ఉండలేకపోయారు. తాజాగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలి అందరు వచ్చారు. అయితే ఫ్యామిలీ ఫొటోస్ లో ఎక్కడ చైతన్య కనిపించలేదు. అప్పటికే అందరికి డౌట్ ఉండగా తాజగా వీరిద్దరూ అధికారికంగానే ప్రకటించుకున్నారు. అంతక ముందే అక్కినేని ఫ్యామిలీలో కూడా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. నాగచైతన్య- సమంత మొదటి సినిమాతోనే ప్రేమలో పడ్డారనే విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే కొన్నేళ్ళకే వీరు విడాకులు తీసుకున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ జంట ధనుష్ ఐశ్వర్య కూడా ఎన్నో సంవత్సరాలు కలిసి ఉండి తాజాగా విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు మరో హీరోయిన్ విడాకులకు సిద్ధమయ్యిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్నిరోజులుగా భర్తకి దూరంగా ఉంటూ విడాకులకు అప్లై చేసినప్పటికీ ఆ విషయాన్ని ఇంకా రహస్యంగానే ఉంచింది. విడాకులు వచ్చాకే అధికారికంగా ప్రకటించడానికి సిద్దమవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని రోజులకే భర్తతో దూరంగా ఉంటుందంట. తల్లితండ్రులను ఒప్పించి విడాకులు తీసుకోడానికి రెడీ అయ్యింది. అయితే ఆ హీరోయిన్ ఎవరో విడాకులు వచ్చాకే తెలిసే అవకాశం ఉంది.