ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

ప్ర‌స్తుత రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయ‌డ‌మే గ‌గ‌నం అయిపోయింది. కానీ, ఒక‌ప్పుడు మాత్రం హీరోలు ఏడాదికి ప‌ది, ఇర‌వై చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేవారు. అంతేకాదు సౌత్ పిల్మ్ ఇండ‌స్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవ‌లం ఒక్క‌ ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో తెలుసా.. మ‌ల‌యాళ సూప‌ర్‌ స్టార్ మోహ‌న్ లాల్‌.

దాదాపు నాలుగు ద‌శాబ్దాల నుంచి సినీ రంగంలో కొన‌సాగుతున్న మోహ‌న్ లాక్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 340 చిత్రాల‌కు పైగా చేశారు. నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే మ‌రెన్నో ప్ర‌తిష్టాత్మాక పురుస్కారాల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తున్న మోహ‌న్ లాల్‌.. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఏ హీరోకు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును నెల‌కొల్పారు.

1986లోనే మోహ‌న్ లాల్ న‌టించిన 34 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో ఏకంగా 25 చిత్రాలు పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అయ్యాయి. దాంతో మోహ‌న్ లాక్ ఒకే ఏడాదిలో అత్యధిక చిత్రాల్లో నటించడమే గాక.. అత్యధిక హిట్ చిత్రాల క‌థానాయ‌కుడిగా రేర్ రికార్డును సృష్టించాడు. ఈ రికార్డును ఇప్పటికీ ఏ హీరో బ్రేక్ చేయ‌లేక‌పోయాడు.