ఏం సాధించావ‌ని నిద్ర‌ప‌డుతుందిరా అంటూ సూర్య‌ను ఘోరంగా అవ‌మానించిన న‌టుడు ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి అనేక విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడిగా సూర్య జ‌న్మించాడు. ఈయ‌న అస‌లు పేరు శరవణన్ శివకుమార్. సినిమాల్లోకి రాక‌ముందు సూర్య గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఆ సంస్థలో సూర్య రోజుకు ఏకంగా 18 గంటల పాటు కష్టపడేవారు.

అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవ‌లం రూ. 750 రూపాయలు మాత్రమే జీతం వ‌చ్చేది. దాంతో సినిమాలే వ‌ద్దనుకున్న సూర్య‌.. చేసేదేమి లేక ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశాడు. శివకుమార్ కొడుకు కావడంతో సూర్యకు సినిమాల్లో సులభంగానే అవకాశాలు దక్కాయి. తండ్రి స‌పోర్ట్ తో సూర్య వ‌రుస సినిమాలు చేశాడు. కానీ, స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. ఈ టైమ్ లోనే సూర్య‌ను న‌టుడు ర‌ఘువ‌ర‌న్ ఘోరంగా అవ‌మానించాడు.

ఓ సారి వీర‌ద్ద‌రూ క‌లిసి రైలు ప్ర‌యాణం చేశారు. అయితే ట్రైన్ లో సూర్య గాఢ నిద్ర‌లోకి జారుకున్నాడు. ఇది గ‌మ‌నించిన ర‌ఘువ‌ర‌న్ సూర్య‌ను త‌ట్టిలేపి `ఏం సాధించావ‌ని నిద్ర‌ప‌డుతుందిరా..? ఇంకా ఎంత‌కాలం మీ నాన్న పేరు చెప్పుకుని ఇండ‌స్ట్రీలో బ‌తుకుతావ్‌..?` అని ముఖం మీదే అన్నార‌ట‌. ర‌ఘువ‌ర‌న్ మాట‌ల సూర్య‌ను ఎంత‌గానో బాధ‌పెట్టాయి. అప్పుడే సూర్యలో కొత్త మార్పు వ‌చ్చింది. న‌టుడిగా త‌న‌ను తాను మెరుగుప‌రుచుకుంటూ ముందుకు సాగాడు. అలాగే క‌థ‌ల ఎంపికలో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌డం స్టార్ట్ చేశాడు. క్ర‌మంగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను ఏర్ప‌ర్చుకున్నాడు.