బీచ్‌లో బికినీలో ప్రియ ప్రకాష్ వారియర్.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు..

ఒరు అదార్ లవ్ సినిమాలో ఒక్క సాంగ్ సీన్ తో ఇండియాలోనే పాపులర్ అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తార తరచుగా గ్లామర్ ఫోటోషూట్‌ల ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. థాయ్‌లాండ్‌లోని బీచ్‌లలో ఆమె విహార యాత్రలకు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ప్రియా వారియర్ బీచ్ నుండి తన కొత్త చిత్రాలను పంచుకున్నారు. ప్రియా ఆరెంజ్ బికినీ టాప్ మరియు బ్లాక్ జీన్స్ షార్ట్ ధరించి ఉంది. చిత్రాలు థాయ్‌లాండ్‌లోని మాయా బే అనే బీచ్‌లోనివి. ప్రియా తాను సముద్రంలో లైఫ్ జాకెట్ ధరించి ఈత నేర్చుకుంటున్న ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫొటోలలో ప్రియ చాలా గ్లామర్‌గా కనిపించింది. ప్రియా బికినీ తరహా డ్రెస్సులు తరచూ వేసుకుంటుంది. ఆ ఫొటోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. ఆమె హాట్‌గా కనిపిస్తోందని, ప్రియా మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ భామ తెలుగులో కూడా వరుస సినిమాలలో నటిస్తోంది. గతంలో నితిన్ సరసన జోడీగా చెక్ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు తగ్గలేదు. ఆ తర్వాత ఇష్క్.. ఇట్ నాట్ ఏ లవ్ స్టోరీ అనే సినిమాలో నటించింది. అది కూడా ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ సరసన జోడీగా బ్రో అనే సినిమాలో నటించింది. ఇది త్వరలో విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సముద్రఖని దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ ఉండడంతో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఆమె తన కెరీర్ పుంజుకుంటుందని భావిస్తోంది.