అందువల్లే హ్యాపీడేస్ అపర్ణ కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో శేఖర్ కమల తీసిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద సక్సెస్నో సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో నటించిన హీరోలు హీరోయిన్స్ ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారో తెలిసిందే..ఈ సినిమా లో అప్పు పాత్ర ఈ సినిమా సక్సెస్ కావడానికి కీలకంగా వ్యవహరించింది..అప్పు రియల్ నేమ్ గాయత్రి రావు ఈ అమ్మడు హ్యాపీ డేస్ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది.కానీ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది.

Happy Days

అయితే గాయత్రి రావు వాళ్ళ అమ్మ కూడా పెద్ద నటి ఆమె కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు బెంగుళూరు పద్మ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బెంగళూరు పద్మ తన కూతురు ఆశించిన స్థాయిలో సక్సెస్ను సాధించకపోవటానికి కొన్ని కీలకమైన వ్యాఖ్యలను తెలిపారు.

ఇప్పుడు గాయత్రి రావు ఆస్ట్రేలియాలో ఉందని తన కూతురికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమని ఒక సందర్భంలో శేఖర్ కమల తనను చూసి ఆ సినిమాలో తీసుకున్నారని తెలిపింది. ఆ సినిమాలో టామ్ బాయ్ క్యారెక్టర్ కాబట్టి తన జుట్టుని కట్చేసారని తెలిపింది. ఆ తర్వాత ఒక హర్రర్ సినిమాలో నటించిందట..ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత తను చదువుకోవడానికి వెళ్లిందని బెంగళూరు పద్మ తెలియజేశారు.

గబ్బర్ సింగ్ సినిమాలో తను బోల్డ్ రోల్లో నటించడమే ఆమెకి శాపంగా మారిందని తెలియజేస్తోంది.. మొదట తన పాత్ర ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా గబ్బర్ సింగ్ లో తెలిపారని అలా మమ్మల్ని మోసం చేశారని తెలిపింది పద్మ. ఇప్పుడు ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.