కెరీర్ ఆరంభం నుంచి అపజయం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం `భగవంత్ కేసరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లోకేషన్ లో ఉన్న అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి ప్రముఖ నటుడు బ్రహ్మాజీ బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు అనిల్ రావిపూడిని కత్తి చూపించి బెదిరించాల్సిన అవసరం బ్రహ్మాజీకి ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నారా.. రీజన్ ఉందడోయ్. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన `స్లమ్ డాగ్ హజ్బెండ్` చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర టీమ్ అన్ని విధాలుగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
బ్రహ్మాజీతో ఉన్న సన్నిహిత్యం కారణంగా అనిల్ రావిపూడి సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర ప్రమోషన్స్ లో పాల్గొని తనవంతు సపోర్ట్ చేశాడు. అయినా కూడా బ్రహ్మాజీ అనిల్ రావిపూడిని వదలకుండా.. స్లమ్ డాగ్ హజ్బెండ్ రిలీజ్ డేట్ చెబుతూ ఓ వీడియో చేయమంటూ ఒత్తిడి చేశాడు. అందుకు అనిల్ నో చెప్పడంతో.. బ్రహ్మజీ ఏకంగా కత్తి పీక మీద పెట్టి ఆయన చేత బలవంతంగా రిలీజ్ డేట్ చెప్పించాడు. అయితే ఇదంతా సీరియగా చేసింది కాదండోయ్.. ఫన్ కోసమే చేశారు. మొత్తానికి వీరి వీడియో వైరల్ గా మారడంతో స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీకి దక్కాల్సిన ప్రమోషన్ దక్కింది.
Funny Banter Between Actor #Brahmaji & Director #AnilRavipudi
#SlumDogHusband in THEATRES on 29th July. pic.twitter.com/8hTbngAUc4
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) July 23, 2023