ఇండస్ట్రీలో అందరి హీరోలతో నటించిన శ్రియ.. ఆయనతో మాత్రమే నటించలేదు.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రేయ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . “ఇష్టం” అనే సినిమా ద్వారా ఎంతో అందరికీ ఇష్టంగా మారిపోయిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతూ వచ్చింది. హిట్లు ఫ్లాపులు అని తేడా లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ .. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించి క్రేజీ టాక్ ను సొంతం చేసుకుంది . అంతేనా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుని ఒకానొక టైం లో స్టార్ హీరోలు కూడా అమ్మడు కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసే స్థాయికి ఎదిగిపోయింది .

అయితే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రియ ఒక్క హీరోని మిస్ చేసింది . ఆయన కూడా టాప్ హీరో . అయితే ఎందుకు శ్రేయ ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు అవకాశాలు రాలేదా..? వచ్చిన చేయలేదా..? అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చిస్తున్నారు . ఈ క్రమంలోనే ఆయనతో అవకాశం చేసే ఛాన్స్ చాలా వచ్చినా శ్రీయ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దానికి మెయిన్ రీజన్ శ్రేయ కన్నా ఆ హీరో పొట్టిగా ఉండడమే. శ్రేయ శరణ్ కన్నా హీరో పొట్టిగా ఉన్న కారణంగా తెరపై వీరిద్దరూ అక్క తమ్ముళ్ల లా కనిపిస్తారని .. ఆ కారణంగానే స్క్రీన్ షేర్ చేసుకోలేక పోయిందని .. అది తప్పిస్తే మరి ఏ రీజన్ లేదు అంటూ శ్రేయ డైరెక్టర్స్ కి మేకర్స్ కు క్లారిటీ ఇచ్చిందట . ఈ క్రమంలోనే శ్రేయ పేరు మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ రన్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతుంది శ్రేయ. తనదైన స్టైల్ లో సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకుంటుంది..!!