విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మోస్ట్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈయన గత చిత్రం `లైగర్` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినా సరే విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే పాన్ ఇండియా మూవీని పూర్తి చేశాడు.

 

ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టించ‌గా.. సెప్టెంబ‌ర్ 1వ తేదీన ఈ మూవీ విడుద‌ల కానుంది. అలాగే ఇటీవల గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్ లో విజ‌య్‌ ఓ మూవీని ప్రారంభించాడు. అలాగే ప‌రుశురామ్ తో ఓ సినిమాను షురూ చేశాడు. ఈ రెండు చిత్రాలు ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మోస్ట్ ఫేవ‌రెట్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ర‌ష్మిక మాత్రం కాదండోయ్‌. అస్స‌లు గెస్ కూడా చేయ‌లేరు. బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే అంటే విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎంతో ఇష్ట‌మ‌ట‌. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించాడు. ఆమె న‌ట‌న త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంద‌ని.. అందుకే రాధికా ఆప్టే అంటే ఇష్ట‌మ‌ని విజ‌య్ పేర్కొన్నాడు.