విడుదలకు ముందే రికార్డు సృష్టిస్తున్న నిఖిల్ స్పై మూవీ..!!

ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు సంపాదించిన నిఖిల్.. కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. కంటెంట్ బాగుంటే చాలు ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంతో నిఖిల్ పలు రకాల విభిన్నమైన కథలను ఎంచుకొని మరి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా సుభాష్ చంద్రబోస్ మరణం మిస్టరీ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం స్పై.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉండడంతో పాటు అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Spy (2023) - IMDb
ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వామి రారా సినిమా తో పందా చూపించిన నిఖిల్ రీసెంట్గా వచ్చిన 18 పేజీస్ సినిమా వరకు వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. ఇప్పుడు స్పై మూవీ తో కూడా సక్సెస్ అందుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.. ఇది ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.

Spy Movie (2023): Nikhil Siddharth | Cast | Trailer | OTT | Songs | First  Look | Release Date - News Bugz
ఈ సినిమా బుకింగ్స్ తో పలు రికార్డు క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది.. ఈ సినిమా బుకింగ్ ఓపెనింగ్ అయినా 9 నిమిషాలలోనే క్లోజ్ అయినట్టుగా తెలుస్తోంది.. కేవలం 9 నిమిషాలలో బుకింగ్ క్లోజ్ అవ్వడంతో స్పై మూవీ రికార్డు క్రియేట్ చేస్తుందని అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. మరి ఏ మేరకు అభిమానులను ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి మరి.