లావణ్యతో వరుణ్ మరో మూవీ..ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన వరుణ్

మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇదివరకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ జరగగా, తాజాగా రామ్ చరణ్ – ఉపాసనకి ఆడపిల్ల పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి టాపిక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి అంతరిక్షం మరియు మిస్టర్ సినిమాలో నటించారు. అయితే పెళ్లి తరువాత కూడా లావణ్య సినిమాలు చేస్తుందా అని అందరికి ఒక ప్రశ్న ఉండేది. అయితే తాజాగా వరుణ్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడాడు.

వరుణ్ మాట్లాడుతూ లావణ్యతో కలిసి మళ్ళీ నటించాలని ఉందని, అయితే ఈసారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ లో నటించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. దీంతో లావణ్య పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తుందని, కొన్ని సినిమాల్లో వరుణ్, లావణ్య కలిసి నటించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. లావణ్య త్రిపాఠి మరియు తన కాంబో లో సినిమా లు ముందు ముందు వస్తాయని.. అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అన్నట్లుగా కాకుండా ఆకట్టుకునే విధంగా ఉంటాయి అన్నట్లుగా కూడా వరుణ్ సన్నిహితుల వద్ద అన్నాడట.

వరుణ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన లేడీస్ సినిమాల్లో రావడం లేదు. ఇలానే పెళ్లి తరువాత లావణ్య కూడా సినిమాలకు దూరం అవుతుందా అనే ప్రశ్నకు తాజాగా వరుణ్ చేసిన కామెంట్స్ తో ఫుల్ స్టాప్ పడింది. అంతే కాదు పెళ్లి తరువాత వరుణ్ తోనే లావణ్య మరో రెండు లేదా మూడు సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. వీరి పెళ్లి డేట్స్ కూడా త్వరలోనే తెలియనున్నాయి.