ముఖం మొత్తం గుంత‌లే.. నువ్వు హీరోనా అంటూ సిద్ధు జొన్నలగడ్డను అవ‌మానించింది ఎవ‌రు?

యంగ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జోష్ మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు పోషించారు. కానీ, స‌రైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 2016లో విడుద‌లైన `గుంటూర్ టాకీస్`తో సిద్ధు జొన్నలగడ్డ కాస్త ఫేమ్ లోకి వ‌చ్చాడు. ఈ మూవీలో హీరోగానే కాకుండా డైలాగ్ రైటర్ గాను పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.

గ‌త ఏడాది విడుద‌లైన `డిజె టిల్లు` మూవీతో సిద్ధు జొన్నలగడ్డ ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. సిద్ధుకు టాలీవుడ్ లో భారీ క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం డిజె టిల్లు సీక్వెల్ `టిల్లు స్కేర్‌`తో పాటు `దట్ ఈజ్ మహాలక్ష్మి`, `తల్లుమాల` రీమేక్ చిత్రాల్లో చేస్తున్నాడు. అలాగే టాలీవుడ్ లో చాలా ఏళ్ల నుంచి స్టైలిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, లిరిసిస్ట్ గా సేవలు అందిస్తోన్న నీరజా కోన ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నారట. ఆమె తొలి సినిమా సిద్ధు తోనే చేయ‌బోతోంది.

 

ఈ మూవీకి ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వ‌ర్క్ చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సిద్ధు.. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌ను ఎన్నో విష‌యాల‌ను పంచుకున్నాడు. అలాగే ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎదురైన ఓ ఘోర అవ‌మానాన్ని కూడా బ‌య‌ట‌పెట్టాడు. “నా ముఖం మీద మొటిమలు వాటి తాలుకా మచ్చలు, గుంతలు ఉంటాయి. అయితే సినిమాల్లో ప్రయత్నాలు చేసేటప్పుడు ఒక‌త‌ను `ముఖం మొత్తం గుంత‌లే.. నువ్వు హీరో అవుతావా..?` అంటూ ముఖం మీదే అన్నారు. ఆ మాట తట్టుకోలేక చాలా ఏడ్చే. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండద‌ని నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఇంకా కసిగా ప్రయత్నాలు చేశాను` అంటూ సిద్ధు చెప్పుకొచ్చాడు. దీంతో సిద్ధును అంత ఘోరంగా అవ‌మానించిన వ్య‌క్తి ఎవ‌రు అని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు.