రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ విన్నర్

రాజకీయాల్లోకి బిగ్ బాస్ విన్నర్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నా రాజకీయాల్లోకి రావాలని, కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ కాబట్టి ఇప్పటికే ఆయన ఎవరో మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆయనే వీజే సన్నీ. వీజే సన్నీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ లో విన్నర్ గా గెలిచి మరింత ఫేమస్ అయ్యారు. దీంతో వీజే సన్నీకి మంచి గుర్తింపు దక్కింది. బిగ్ బాస్ తరువాత వీజే సన్నీ బిజీబిజీగా అయిపోయారు. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లోనే కాదు వీజే సన్నీ వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వీజే సన్నీ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో వీడియోను కూడా షేర్ చేశారు. నేను మీతో ఒక న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని నేను కూడా నా సొంత పార్టీని స్టార్ట్ చేయబోతున్నాను. బుధవారం మధ్నాహ్నం 2 గంటలకు నా పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతోంది. మీ అందరికీ మరింత దగ్గరవడానికి ఒక ప్రయత్నంగా ఒక పార్టీని ప్రారంభించబోతున్నాను.


మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటూ వీజే సన్నీ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సినిమాకు సంబందించిన వార్త అయి ఉంటుందని కొందరు అనుకుంటుండగా మరి కొందరు శుభాకాంక్షలు చెబుతున్నారు. కొందరు మాత్రం సినిమాలు చేసుకోకుండా నీకు ఇవన్నీ అవసరమా అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.