టాలీవుడ్ లో శ్రీ‌లీల మోస్ట్ వాంటెడ్ కావ‌డానికి ఆ నాలుగే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీల పేరే వినిపిస్తోంది. ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై రెండేళ్లు కూడా కాలేదు. కానీ అటు టాప్ స్టార్స్ తో పాటు ఇటు యంగ్‌ హీరోలు కూడా శ్రీ‌లీల‌నే జోడీగా కోరుకుంటున్నారు. దాదాపు పది ప్రాజెక్టులతో శ్రీలీల బిజీగా ఉంది అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్లు సైతం శ్రీలీల దెబ్బకు వణుకుతున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలోనే శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారడానికి నాలుగు అంశాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

డాన్స్.. శ్రీలీలకు బాగా ప్లస్ అయిన అంశం. తెలుగు హీరోయిన్ల ఊరమాస్‌ డాన్స్ చేసేవారు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. కానీ శ్రీలీల మాత్రం తొలి సినిమా నుంచి తన డాన్సింగ్ స్కిల్స్ తో దర్శక నిర్మాతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ధమాకాలో ఈ అమ్మడి డాన్స్ కు దాసోహం కానీ వారు ఉండరు.

అలాగే భాష అనేది శ్రీలీలకు కలిసొచ్చిన అంశం. ప్రతి ఏడాది టాలీవుడ్లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ వారిలో పది శాతం మందికి కూడా తెలుగు రాదు. అయితే అమెరికాలో పొట్టి బెంగుళూరులో పెరిగిన శ్రీలీల మాత్రం తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తన ప్రతి సినిమాకు స్వయంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటుంది.

శ్రీ‌లీల గ్లామర్ కు ఎలాంటి కండిషన్స్ పెట్టదు. దర్శకులు ఎలా కావాలనుకుంటున్నారో అలా కనిపించడానికి శ్రీలీల ఒప్పుకుంటుంది పైగా చీర కట్టినా.. మోడ్ర‌న్ డ్రెస్ వేసిన శ్రీలీల అందం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇది శ్రీ‌లీల‌కు కలిసొచ్చిన మరొక అంశం.

ఇక‌ టాలీవుడ్ లో హీరోయిన్లంద‌రూ దాదాపు 30 ఏళ్లకు పైబడిన వారే. 30 ఏళ్లలోపు కొంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వారు స్టార్ హీరోల రేంజ్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. కానీ 22 ఏళ్ల శ్రీ లీల మాత్రం అటు యంగ్ హీరోలతో పాటు ఇటు టాప్ స్టార్స్ కు కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. అందుకే ఆమె టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిందని అంటున్నారు.