యమదొంగ చిత్రంలో యముడి పాత్ర మిస్ చేసుకున్న నటుడు..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు యముడి పాత్ర అంటే టక్కున గుర్తుకు వచ్చేది నటుడు కైకాల సత్యనారాయణే.. ఆయన నటనతో ,ప్రతిభతో ఎన్నో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించారు. వెనకటి తరం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఎన్నో చిత్రాలలో యముడి పాత్రలో నటించారు. తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో యముడి పాత్రలో అలరించిన ఈయన ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో మాత్రం యముడిగా నటించలేకపోయారు. అందుకు కారణం ఏంటో తెలుసుకుందాం.
Amazon.com: Yamadonga : Jr NTR, Mohan Babu, Priyamani, Mamta Mohandas, S.S.  Rajamouli, D.S. Kannan, Vijayendra Prasad, M. Rathnam, S.S. Rajamouli,  Urmila Gunnam, Urmila Gangaraju, Chiranjeevi Pedamallu: Prime Video
కైకాల సత్యనారాయణ ఎన్నో చిత్రాలలో విలన్ గా ,తండ్రి పాత్రలలో ,తాత పాత్రలలో పోషించి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తన సినీ కెరియర్ లో 700కు పైగా సినిమాలలో నటించిన కైకాల సత్యనారాయణ గారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాలో మాత్రం ఆయన యముడిగా నటించలేదు.. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో ఆయనని ప్రశ్నించగా ఈ విషయం పైన అప్పట్లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
Kaikala Satyanarayana passes away - The Hindu
కైకాల సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. మొదటిసారిగా యమగోల సినిమాలో తాను యముడిగా నటించారని ఆ సినిమాలో యముడిగా తాను ఎన్టీఆర్ పోటీ పడ్డామని గుర్తు చేశారు.. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో తనని యముడి పాత్రలో నటించమని కోరారని కానీ రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమాలో నటించానని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆ పాత్రని మోహన్ బాబు గారు చేశారని తెలిపారు.
 మోహన్ బాబు కూడా ఈ సినిమాలోని పాత్ర అద్భుతంగా నటించారు. అప్పటివరకు ఆయన క్రేజ్ తగ్గిన ఈ సినిమాతో మళ్ళీ పెంచేసుకున్నారని చెప్పవచ్చు. యమదొంగ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.