భర్తతో విడాకుల‌కు రెడీ అయిన ఆసిన్.. నోరు విప్పిన స్టార్ హీరోయిన్!

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌ ఆసిన్‌.. బాలీవుడ్ లోనూ అనేక చిత్రాలు చేసింది. అయితే రెండు రోజుల నుంచి ఆసిన్ కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఆమె త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. 2016లో వ్యాపార‌వేత్త‌ రాహుల్ శర్మతో ఆసిన్ ఏడ‌డుగులు వేసింది.

పెళ్లి త‌ర్వాత‌ సినిమాలకు దూర‌మైన ఆసిన్‌.. సంపూర్ణ గృహిణిగా మారింది. పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కొన్నేళ్ల నుంచి భ‌ర్త, పాప‌తో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆసిన్, ఆమె భ‌ర్త‌కు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని.. అవి పెరిగి పెరిగి విడాకుల వ‌ర‌కు వెళ్లాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై ఆసిన్ నోరు విప్పింది. విడాకుల‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. `ప్రస్తుతం నేను నా భ‌ర్త‌తో వేసవి సెలవుల‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడే ఇద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఈ వార్తలు చూశాం. ఇవి పూర్తిగా అవాస్తవం. మా పెళ్లి టైమ్ లో కూడా మేము బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు రాశారు. ఇలాంటి చెత్త వార్తలు రాయ‌డం ఇక‌నైనా ఆపండి` అంటూ ఆసిన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.