ఫారెన్ లో లావ‌ణ్య‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వ‌రుణ్‌.. పెళ్లికి ముందే ఇవేం ప‌నులు గురూ?!

`మిస్ట‌ర్` మూవీతో ప్రేమ‌లో ప‌డిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కావాల‌ని నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబ‌స‌భ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. జూన్ 9వ తేదీన వ‌రుణ్‌, లావ‌ణ్య ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది.

దీంతో అభిమానులు, నెటిజ‌న్లు మరియు తోటి సినీ త‌రాలు కాబోయే భార్య‌భ‌ర్త‌ల‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. వీరంద‌రికీ వ‌రుణ్ రిప్లై ఇచ్చాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వరుణ్ తేజ్ స్పందిస్తూ… `హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు` అంటూ పేర్కొన్నాడు. ఈ మేర‌కు ఓ పిక్ షేర్ చేయ‌గా.. అది కాస్త వైర‌ల్ గా మారింది.

ఈ పిక్ లో వ‌రుణ్ తేజ్ త‌న ప్రియ స‌ఖి లావ‌ణ్య‌తో క‌లిసి ఫారెన్ లో ఎంజాయ్ చేస్తూ క‌నిపించాడు. వరుణ్ వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంటులో ఉండగా.. లావణ్య బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ధరించి కూల్ లుక్ లో ఆక‌ట్టుకుంది. అయితే ఎంగేజ్మెంట్ అయిన వెంట‌నే వీరిద్ద‌రూ ఫారెన్ చెక్కేశా..? లేదా ఇది ఓల్డ్ ఫోటోనా..? అన్న‌ది తెలియ‌దు. కానీ, నెటిజ‌న్లు మాత్రం పెళ్లికి ముందే హ‌నీమూన్ ఎంజాయ్ చేస్తున్నారా.. ఇవేం ప‌నులు గురూ అంటూ వ‌రుణ్ తేజ్ ను ఆట‌ప‌ట్టిస్తున్నారు. కాగా, వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ప్ర‌వీన్ స‌త్తారు డైరెక్ష‌న్ లో `గాండీవధారి అర్జున` చిత్రంలో నటిస్తున్నాడు. మ‌రోవైపు లావ‌ణ్య సైతం వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉంది.