కీర్తి సురేష్ పై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నది మరొకవైపు తమిళంలో డైరెక్టర్ సెల్వరాజ్ తెరకేకిస్తున్న ఉదయనిది స్టాలిన్ హీరోగా నటిస్తున్న ఒక చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్నటి రోజున చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు తమిళ సినీ ప్రముఖులతో పాటు కమలహాసన్ కూడా ముఖ్యఅతిథిగా రావడం జరిగింది.ఈ సందర్భంగా కమలహాసన్ కీర్తి సురేష్ పైన ప్రశంశాలు వర్షం కురిపించారు.

Pic: Kamal Haasan congratulates Keerthy Suresh for 'Nadigaiyar Thilagam' |  Tamil Movie News - Times of India
కమలహాసన్ మాట్లాడుతూ కీర్తి సురేష్ ఒక గొప్ప నటి అని ఆమె బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ కితావించారు అలాగే ఈ సినిమాలో నటించేందుకు కీర్తి సురేష్ ఒప్పుకోవడం ప్రశంసించదగిన విషయం అంటూ తెలిపారు.. మాయన్నన్ చిత్రం భారీ విజయం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పొలిటికల్ త్రిల్లర్ సినిమా గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ముఖ్యంగా డైరెక్టర్ సెల్వరాజ్ ఇతరులు అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఇస్తారు ఆయనలో అదే తనకు చాలా ఇష్టమని తెలిపారు కమలహాసన్.

ఈ చిత్రంలో వడివేలు కీర్తి సురేష్ మరియు ఫహద్ ఫాజిల్, విజయ్ కుమార్, రవినా రవి ,లాల్ తదితరులు కీలకమైన పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ప్రస్తుతం కమలహాసన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా తనలోని నటనపరంగా మరొక కొత్త యాంగిల్ ని బయట పెట్టింది.