నాగార్జునతో టబు కున్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చిన చైతు..!!

టాలీవుడ్ లో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తున్న రూమర్సులో అక్కినేని నాగార్జున -టబు మధ్య ఉన్న ప్రేమాయణం గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో నిన్నే పెళ్ళాడుతా అనే సినిమాలో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పట్లో మీడియాలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఫోటోలలో నాగార్జున భార్య అమలా కూడా ఉండడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించేలా చేసింది.

When Nagarjuna's wife Amala responded to rumours of him dating Tabu: 'It  will contaminate my house' | Entertainment News,The Indian Express

వీరిద్దరి మధ్య సాగే ప్రేమాయణం గురించి అమలాకి కూడా తెలుసా తెలిసి కూడా ఆమె సైలెంట్ గా ఉందా అని అనుమానాలు కూడా అభిమానులలో ఎక్కువ సందేహాన్ని కలిగించింది. తాజాగా నాగార్జున,టబు రిలేషన్ గురించి నాగార్జున కుమారుడు అక్కినేని నాగచైతన్య తెలియజేయడం జరిగింది.. చైతన్య మాట్లాడుతూ ఇండస్ట్రీ నుంచి మా కుటుంబానికి చాలా దగ్గరైన వ్యక్తి హీరోయిన్ టబు గారు.. మా ఫ్యామిలీ మొత్తానికి ఆమె నేను చిన్నతనం నుంచి చాలా క్లోజ్ గా ఇండస్ట్రీకి చెందిన వారిలా కాకుండా సొంత కుటుంబ సభ్యులలో ఒకరిగా ఉంటుందని తెలిపారు.

ఇప్పటికీ కూడా పండుగల సమయంలో మా ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటుందని హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా తన తండ్రి గారిని కుటుంబాన్ని కలిసి వెళుతుండని నాగచైతన్య తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే నాగార్జున- టబు మధ్య నిజంగానే అప్పట్లో ప్రేమాయణం నడిచిందా లేకపోతే స్నేహితుల అనే విషయం అందరినీ కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో కొన్ని మీడియా సంస్థలు నాగార్జున టాబు మధ్య ఏదో ప్రేమ సంబంధం ఉన్నట్లుగా చిత్రీకరించారు.. కానీ వీరి స్నేహ బంధాన్ని కూడా తప్పుగా చూపించిందని నాగార్జున అభిమానులు కామెంట్స్ చేయడం జరిగింది.