సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలి అనే విషయాన్ని వాళ్లే చూస్ చేసుకుంటారు . ఆ తంతు ఇప్పటిది కాదు ఎప్పటినుంచో స్టార్ హీరోలు ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అప్పటి హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన విశ్వక్సేన్ లాంటి వాళ్లు కూడా తమ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలో వాళ్లే చూస్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆ సెలక్షన్ సక్సెస్ అవుతుంది ..మరికొన్నిసార్లు ప్లాప్ అవుతుంది .
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మహేష్ బాబు చూస్ చేసుకున్న ఏ హీరోయిన్ కూడా ఫ్లాప్ అవ్వలేదు. కధ పరంగా కంటెంట్ పరంగా ఆయన చూస్ చేసుకున్న హీరోయిన్స్ అందరూ మంచి సత్తాని చాటుకు వచ్చారు . ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో హీరోయిన్స్ ని ఆ క్వాలిటీ చూసే సెలెక్ట్ చేసుకుంటారు అన్న న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు తన సినిమాలో ఏ హీరోయిన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో.. ఆ హీరోయిన్ ని ముందు నుంచే బాగా అబ్సర్వ్ చేస్తారట.
డాన్స్ ఎలా వేస్తుంది.. ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుంది.. నటన పరంగా ఎలాంటి సత్తా ఉంది.. అది రొమాంటిక్ ..సాడ్ ..ఎలాంటి సీన్స్ ఎలా చేయగలుగుతుంది అంటూ ఒకటికి పది సార్లు పరిశీలించిన తరువాతే ఆ హీరోయిన్ తన సినిమాలు చూస్ చేసుకుంటారట . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే మహేష్ బాబు సినిమాలో చేసిన ప్రతి హీరోయిన్ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా సరే సదరు హీరోయిన్ నటన బాగుంది అంటూ జనాలు అప్రిషియేట్ చేశారు. అంతేకాదు గతంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా అలాగే చేసేవారట. ఫ్లాప్ హీరోయిన్స్ ని కూడా తమ సినిమాలో పెట్టుకొని ఆ హీరోయిన్లకు హిట్ ట్రాక్ అందించారట . ఇప్పుడు అలాగే మహేష్ బాబు కూడా హీరోయిన్ హిట్టా – ఫట్టా అని కాకుండా నటన టాలెంట్ ఉందా..? లేదా ..? చూస్తూ అవకాశాలు ఇస్తున్నారు..!!