ఇటుకల బట్టిలో పని చేయడానికి వెళ్లిన సోనూసూద్‌.. ఫ్యాన్స్ షాక్!

సిల్వర్ స్క్రీన్‌పై విలన్ పాత్రలు చేస్తూ పాపులర్ అయిన సోనూసూద్‌ కరోనా కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచి హీరో అయ్యాడు. కరోనా తర్వాత కూడా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేసి వారికి ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. ఎప్పటికప్పుడు తనలోని మంచితనాన్ని సింప్లిసిటీని దాతృత్వాన్ని సోను సూద్‌ చాటుకుంటున్న తాజాగా మరోసారి వార్తల్లోని తెచ్చాడు.

ఈ నటుడు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను ఆపలేదు. ఇలా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోనూ సూద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. అభిమానులు ఆ వీడియో ఓపెన్ చేసి చూడగానే ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ నటుడు ఇటుకలు తయారు చేసే చోట కనిపించాడు. ఇది ఊహించని ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. తర్వాత అసలు సంగతి తెలిసి అతని సింప్లిసిటీకి హాట్సాఫ్ చెబుతున్నారు.

షేర్ చేసిన ఈ వీడియోలో సోనూసూద్‌ మండుటెండలో ఇటుకలు తయారు చేస్తున్న ఒక వర్కర్ వద్దకు వెళ్లాడు. అంతేకాదు ఆ మండుటెండలో ఇటుకలు ఎలా చేయాలో తనకు నేర్పమని అడిగాడు. వర్కర్ చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఇటుకలు తయారీ పై అవగాహన పెంచుకున్నాడు. తర్వాత తానే స్వయంగా ఆ ఎండలో ఇటుకలను తయారు చేయడం మొదలుపెట్టి ఆశ్చర్యపరిచాడు. సోను సూద్‌ కావాలనుకుంటే లగ్జరీ లైఫ్ గడప వచ్చు. ఎండ తగలకుండా మట్టి అంటకుండా అతను జీవించగలడు. కానీ అందరితో కలిసిపోతూ అందరికీ అండగా ఉండటమే అతని గొప్పతనం.

అందుకే ఇటికలను తయారు చేసే కార్మికుల నుంచి అభిమానుల వరకు అందరూ అతని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. సోనూ సూద్‌ ఈ వీడియోని షేర్ చేస్తూ ఒక అద్భుతమైన కోట్ కూడా చేశాడు. కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేస్తారు అని ఈ వీడియోకి ఒక మోటివేషనల్ కోట్ యాడ్ చేశారు. ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.