పెళ్లి వల్ల పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయ్యిందా..!!

డైరెక్టర్ జయంత్ టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందించిన డైరెక్టర్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రేమించుకుందాం రా.. బావగారు బాగున్నారా వంటి ఫీల్ గుడ్ మూవీలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. అయితే చాలా కాలంగా ఆయననుంచి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు. ఆయన కెరియర్లో ఎన్నో హిట్స్ అందుకున్న జయంత్ అదే స్థాయిలో ఫ్లాపులను కూడా చవి చూశారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ నటించిన తీన్ మార్ సినిమా భారీగా ఫ్లాప్ అయ్యింది.

Watch Teenmaar - Disney+ Hotstar
దశాబ్ద కాలం క్రితం థియేటర్లో విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచేలా చేసింది. చాలాకాలం తెలుగు తెరకు దూరంగా ఉన్న జయంత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను దర్శకత్వం వహించిన సినిమాల గురించి స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే తీన్ మార్ సినిమా ఫ్లాప్ కావడానికి పలు కారణాలను తెలియజేశారు.. తీన్ మార్ సినిమా రిజల్ట్ విషయం పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ మాత్రం తనకి ఇప్పటికీ ఒక ప్రెస్ లవ్ స్టోరీ గానే అనిపిస్తుందని తెలియజేశారు. అయితే ఈ సినిమా ఫెయిల్ కావడానికి కారణాలు చాలానే ఉండవచ్చు అన్నిటిని నేను చెప్పలేను..

Teenmaar Movie Scenes - Part 12 || Pawan Kalyan, Trisha, Kriti Kharbanda ||  Mani Sharma - YouTube
నాకు తెలిసినంతవరకు పవర్ స్టార్ ఇమేజ్ కి ఈ సినిమా సరిపోలేదు అని కొంతమంది ఫ్యాన్స్ నిరాశక్తి గురయ్యారని తెలిసిందని తెలిపారు.ముఖ్యంగా త్రిష కు సోను సూద్ తో వివాహం చేయడం ఆ తర్వాత ఆమె తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు వాళ్లకు అసలు నచ్చలేదని తెలియజేశారు.. ఒకవేళ ఇదే చిత్రాన్ని అప్పుడున్న యువ హీరోలలో ఎవరితో ఒకరితో తీసి ఉంటే రిజల్ట్ మరొక లాగా ఉండేదంటూ తెలిపారు జయంత్. అయితే ఈ సినిమా మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.