నేడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు సినీ స్టార్స్.. సినీ ప్రముఖులు ..అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విష్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . “మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అంటూ చాలా చాలా ఇష్టంగా ట్విట్ చేశారు .
దీంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అంతేకాదు వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే అంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి . ఇప్పటికే ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారని.. ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ఆ స్క్రిప్ట్ని చరణ్ తో ఫైనలైజ్ చేస్తారని ఓ న్యూస్ వైరల్ అయింది .
అంతేకాదు ఆ స్క్రిప్ట్ ని స్వయంగా ఇంటికి వెళ్లి కూడా వివరించారట. చిరంజీవి సైతం ఆ స్క్రిప్ట్ కి ఇంప్రెస్ అయిపోయారు అంటూ కూడా అప్పట్లో టాక్ వినిపించింది. ఏది ఏమైనా సరే మెగా పవర్ స్టార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా తీస్తే మరో ఆస్కార్ పక్క అంటున్నారు మెగా ఫాన్స్ . దీంతో సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ప్రశాంత్నీల్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!!
Wishing my brother #PrashanthNeel a great birthday and a great year ahead!!
— Ram Charan (@AlwaysRamCharan) June 4, 2023