తల్లి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. ఏంటంటే

ప్రముఖ నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకెళ్లిపోతుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీలీల. ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తుంది.

తాజాగా శ్రీలీలకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంది. శ్రీలీల సినిమాల విషయంలో తన తల్లికి ఒక మాట ఇచ్చిందట. ఇక నుండి శ్రీలీల నటించబోయే సినిమాలో ఎటువంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్స్ లో తాను నటించను అని ఆమె తల్లికి మాట ఇచ్చిందని సమాచారం. శ్రీలీల కేరిర్ ప్రారంభంలో కొన్ని సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించింది. ఆ సీన్స్ ని కొంతమంది ట్రోల్ చేసారు.

శ్రీలీల పై వచ్చిన ట్రోల్స్ తన తల్లి వరకూ వెళ్లడం తో, అవి చూసిన శ్రీలీల తల్లి చాలా బాధపడిందట. చిన్న వయసులోనే ఇలాంటి ట్రోల్స్ స్ప్రెడ్ అయితే రాబోయే రోజుల్లో ఇది ఇంకెక్కడికి దారి తీస్తుందో అని ఆమె భయపడి ఇకనుంచి శ్రీలల అలాంటి రొమాంటిక్ సీన్స్ లో నటించబోదని మాట తీసుకుందట. తల్లి మాటను గౌరవించి ఆమె చెప్పినదానికి ఓకే చెప్పేసిందట శ్రీలీల. తల్లి కి ఇచ్చిన మాటకోసం తనకు వచ్చిన కొన్ని సినిమా ఆఫర్స్ ని కూడా ఈ అమ్మడు వదులుకుంది అని తెలుస్తుంది. ఇలా కండిషన్స్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో అవకాశాలు వస్తాయో లేదో చెప్పడం కష్టం. మరి ఫ్యూచర్ లో శ్రీలీల కేరిర్ ఎలా ఉంటుందో చూడాలి.