మరొకసారి క్యాన్సర్ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే చిరంజీవి గతంలో క్యాన్సర్ బారిన పడ్డాడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాను ఎప్పుడు క్యాన్సర్ బారిన పడలేదని తెలియజేస్తూ క్యాన్సర్ వ్యాధిపట్ల అవగాహన పెంచాల్సిన అవసరం గురించి మాత్రమే తాను మాట్లాడినట్లు తెలియజేశారు.. గతంలో తాము టెస్టులు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిందని.. తాను ముందుగా ఇలాంటి చేయించుకోక ఉంటే అది క్యాన్సర్ కిందికి మారేదేమో అన్నట్లుగా చిరంజీవి వెల్లడించడం జరిగింది.

Chiranjeevi Pays Heartfelt Tribute To Late Actor NT Rama Rao On His Birth  Anniversary, Writes “Not Only 100 Years, He Will Stay In Our Hearts Forever”

గడిచిన కొన్ని గంటలకు తనకు క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మాట్లాడాను.. రెగ్యులర్గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అంటూ తెలిపారు. నేను అలర్ట్ గా ఉండి కొలను స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను అందులో నాన్ క్యాన్సర్స్ పోలసిస్ డిటెక్ట్ చేసి తీసేసారని చెప్పాను.. ఒకవేళ అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోతే అది క్యాన్సర్ కిందికి మారేదేమో అన్నట్టుగా తెలిపారు చిరంజీవి.

అయితే కొన్ని మీడియా వారు దీనిని తప్పుగా అర్థం చేసుకొని అవగాహన రాహిత్యంతో నేను క్యాన్సర్ బారిన పడ్డాను అని చికిత్స వల్ల బ్రతికానని స్క్రోలింగ్లు పలు రకాల ఆర్టికల్స్ ని మొదలుపెట్టారు. వీడియోలో అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది.. ఈ విషయం పైన చాలామంది తన ఆరోగ్యం గురించి మెసేజ్లు పంపిస్తున్నారని వారందరి కోసమే క్లారిఫికేషన్ ఇస్తున్నానని తెలిపారు.. అలాగే జర్నలిస్టులకు ఒక విజ్ఞప్తి విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇలా రాయకండి అంటూ తెలిపారు.