కుతూరికి స్టార్ హీరోయిన్ పేరుని పెట్టుకుంటున్న చరణ్.. ఆ లక్ కలిసి వచ్చేలా భలే మ్యాచ్ చేసాడే..?

ప్రజెంట్ మెగా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన అప్డేట్ ఫైనల్లీ రివీల్ అయింది . ఇవాళ తెల్లవారుజామున ఒంటిగంట 45 నిమిషాలకు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది . దీంతో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి . కాగా మళ్లీ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అంటూ మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబ సభ్యులు ఉపాసన- చరణ్ కు కంగ్రాజులేషన్స్ విషెస్ అందిస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ తన కూతురుకు స్టార్ హీరోయిన్ పేరు పెడుతున్నారు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఈ న్యూస్ ప్రకారం రామ్ చరణ్ – ఉపాసన కూతురుకు అంజలి అనే పేరుని కన్ఫర్మ్ చేశారట . దానికి మెయిన్ రీజన్ చరణ్ వాళ్ళ నానమ్మ అంజనా దేవి . ఆమె పేరు కలిసి వచ్చేలా పాపకి అంజలి అనే పేరు పెడుతూ కొణిదెల ఫ్యామిలీకి అంజనాదేవి ఎంత లెక్క తీసుకొచ్చిందో..

ఇకపై మెగా ఫ్యామిలీకి బుల్లి అంజలి అంతే లక్ తీసుకురావాలి అని చరణ్ ఈ పేరుని పెట్టాలని నిర్ణయించుకున్నారట . అంతేకాదు మొదటినుంచి నాన్నమ్మ అంటే చాలా ఇష్టం ఉన్న చరణ్ ఇలా ఆమె పేరు పెట్టుకొని.. ఆమె అంటే ఎంత ఇష్టమో ప్రూవ్ చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒకప్పటి హీరోయిన్ అంజలీదేవి ..ప్రజెంట్ ట్రెండీ గా మారిపోయిన హీరోయిన్ అంజలి ఇద్దరు స్టార్ హీరోయిన్లే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!