త‌మ‌న్నాకు ర‌జ‌నీకాంత్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. తెగ మురిసిపోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `జైలర్` ఒకటి. సూపర్ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందిస్తున్నాడు.

శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అలాగే త‌మ‌న్నా తొలిసారి ర‌జ‌నీకాంత్ తో జోడీగా క‌డుతోంది. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 10న విడుదల కానుంది. అయితే తాజాగా త‌మ‌న్నాకు ర‌జ‌నీకాంత్ ఓ స్పెష‌ల్ గిప్ట్ ను అంద‌జేశార‌ట‌.

ఒక ఆధ్యాత్మిక పుస్తకంపై త‌న సంత‌కం చేసి తమన్నాకు ర‌జ‌నీకాంత్ గిఫ్ట్ గా ఇచ్చారట. ఇదే విషయాన్ని తమన్నా ట్విట్టర్ లో స్వయంగా వెల్లడిస్తూ తెగ‌ మురిసిపోయింది. జైల‌ర్ షూటింగ్ సమయంలో రజనీకాంత్ ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఆయన సంతకంతో బహుకరించారని.. అది తనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ గా మారింది. కాగా, దాదాపు రెండు ద‌శ‌బ్దాల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా.. ఇప్పుడు జైల‌ర్ తో పాటు భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ ల‌తో పాటు ప‌లు సినిమాల‌కు కూడా క‌మిట్ అయింది.