చరణ్ కి కూతురు పుట్టిన ఆనందం.. చిందులేసిన పవన్-చిరు..డ్యాన్స్ వీడియో వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో .. ఎక్కడ చూసినా సరే హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన పేర్లే మారుమ్రోగిపోతున్నాయి దానంతటికీ కారణం గత పదేలుగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన గుడ్ న్యూస్ వినిపించడమే. నేడు తెల్లవారుజామున ఒంటిగంట 45 నిమిషాలకు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలోనే ఉపాసన మహాలక్ష్మికి జన్మనిచ్చింది అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . మెగా ఇంట ఫుల్ సందడి వాతావరణం నెలకొంది . ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన అడ్మిట్ అవుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సరిగ్గా రాత్రి ఒంటిగంట 45 నిమిషాలకు ఉపాసనకు పాప జన్మించింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు ఫాన్స్.. ఫ్యామిలీ మెంబర్స్ ..ఫ్రెండ్స్ ఉపాసనకు విష్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కొందరు పాత వీడియోస్ ఎడిట్ చేసి ఫన్నీగా కొత్త వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే సూర్యవంశం సినిమాలో వెంకటేష్ కి బాబు పుట్టినప్పుడు ఉన్న వీడియోని ఎడిట్ చేస్తూ చరణ్ – చిరంజీవి – పవన్ కళ్యాణ్ డాన్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు . దీనితో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ఈ వీడియో ప్రజెంట్ వైరల్ గా మారింది..!!