రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం లేకుండా తమ అభిమానించే హీరో వెండితెరపై కనిపిస్తే చాలు అని సంబరపడిపోయా అభిమానులు చాలామంది ఉన్నారు.

Rajinikanth and Jr NTR coming for Karnataka Ratna to Puneeth Raj Kumar
కొంతమంది హీరోలకు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా అభిమానులు ఉంటారు. అయితే రజనీకాంత్ కు మాత్రం ఇండియాలో కాకుండా జపాన్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. రజనీకాంత్ హీరోగా నటించిన ముత్తు చిత్రం జపాన్ లో విడుదలై అప్పట్లోనే పెను సంచలన విజయాన్ని సృష్టించింది. ఆ తరువాత రజినీ నటించిన ఎన్నో చిత్రాలు జపాన్లు విడుదలయ్యాయి. రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ సపరేటుగా ఉందని చెప్పవచ్చు.

రజిని నటించిన రోబో చిత్రం జపాన్లు కలెక్షన్ల సునామీని సృష్టించింది. అయితే ఇప్పుడు అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా జపాన్లో సంపాదించినట్లు తెలుస్తోంది. రజిని తర్వాత ఎన్టీఆర్ కి ఆ అరుదైన క్రెడిట్ దక్కిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాలు జపాన్ లో కూడా విడుదలవుతున్నాయి.. రీసెంట్గా వచ్చిన RRR సినిమా కూడా జపాన్ లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ కి వెళ్లి పాల్గొనడం జరిగింది ఎన్టీఆర్..అప్పటినుంచి ఎన్టీఆర్ సినిమాలుకు సంబంధించి ట్రైలర్ ,టీజర్ ఎలాంటి వచ్చిన జపాన్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారట. జపాన్ లో కూడా ఎన్టీఆర్ అభిమానులను సంపాదించాలంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు.