అవకాశాలు రాక అందాలన్నీ ఆరబోస్తున్న సీతారామం హీరోయిన్..

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ పేరు చెప్తే ‘సీతారామం’ సినిమాలోని సీత పాత్రనే గుర్తుకొస్తుంది. సీతా పాత్రలో ఆమె నటన ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు మోడ్రన్ సీతలా దర్శనమిస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ‘లవ్ స్టోరీ 2’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్స్ అందరూ కలిసి ఫోటోషూట్ లో పాల్గొన్నారు.

ఏడుగురు అందమైన భామలు ఏడురంగుల ఇంద్రధనస్సుల ‘లైఫ్ స్టైల్ ఏషియా’ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఘాటుగా ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఆ ఏడుగురు భామలలో మృణాల్ ప్రత్యేకంగా కనపడుతుంది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో మెరిసిన మృణాల్ పైన వేసుకున్న టాప్‌కి ఉన్న జిప్ ఓపెన్ చేసి మరీ అందాల విందు చేసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు కాకపుట్టించేస్తుంది ఈ భామ. చూసిన వాళ్లకి చూసినంత అన్నవిధంగా గ్లామర్ ట్రీట్ చేస్తుంది మృణాల్.

మృణాల్ ఠాకూర్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఇలా అందాలు ఆరబోయడం చూసి చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక లవ్ స్టోరీ కోసం ఇంతకు తెగించావా సీతా అంటూ కొందరు, వామ్మో సీతలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

‘సీతారామం ‘ సినిమా కి ముందు మృణాల్ ఠాకూర్ చాలా ఇబ్బందులు పడింది. సినిమా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన ఈ బ్యూటీ అవమానలను ఎదుర్కొంది. చివరికి ఆత్మహత్యకు కూడా చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ సమయంలో సీతా రామం సినిమా ఆఫర్ రావడం వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఈ అమ్మడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో నాని 30 సినిమాలో నటిస్తుంది. హిందీలో లవ్ స్టోరీ 2, పూజ మేరీ జాన్, పిప్పా, ఆంఖ్ మిచోలి లాంటి వరుస సినిమా లో నటిస్తూ బిజీగా ఉంది.