విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు.

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ వచ్చి రానట్లు అనిపించింది. మరి అతను తన పోస్ట్‌లో శ్రీజతో విడాకుల విషయం గురించి డైరెక్ట్‌గా చెప్పాడా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్ళితే గత కొంతకాలంగా శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా కొన్ని రోజులు విడివిడిగా ఉంటారని ఆ తర్వాత మళ్లీ కలిసి పోతారని వార్తలు అప్పట్లో వినిపించాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం వారిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి, వారంలో నేను హ్యాపీగా ఉండే నాలుగు గంటలు ఇవే అంటూ కాప్షన్ పెట్టాడు .

నిజానికి పిల్లలు ఉన్న భార్యాభర్తలు విడిపోవాలి అనుకుంటే కోర్ట్ కొన్ని రూల్స్ పెడుతుంది. తల్లితండ్రులు చెప్పేవాటిని విన్న తరువాత వారి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి? ఒకవేళ తల్లి దగ్గర ఉంటే తండ్రి పిల్లల్ని ఎప్పుడు కలవాలి లేదా తల్లి ఏ సమయంలో వారిని కలవాలి? ఎన్ని గంటలకు కలవాలి? అనే విషయాలు అన్ని కోర్ట్ నిర్ణయిస్తుంది. కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ ని బట్టి శ్రీజ, కళ్యాణ్ దేవ్ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థం అయింది. వారు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టే కళ్యాణ్ తన కూతురితో వారానికి కేవలం నాలుగు గంటలు మాత్రమే గడుపుతున్నాడని అర్థం అవుతుంది. కళ్యాణ్ పోస్ట్ ని చూసి వారి విడాకుల విషయం పై అయితే అందరికి క్లారిటీ వచ్చింది.