పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో చేసిన మైథలాజికల్ విజువల్ వంటర్ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
అయినాసరే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రం భారీ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. తెలుగు రాష్ట్రాలో తొలి రోజు రూ. 32 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 15 కోట్లకు పైగా సొంతం చేసుకుంది. అలాగే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 47.88 కోట్లు దక్కించుకున్న ఆదిపురుష్.. వరల్డ్ వైడ్ గా రూ.109.50 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా ఆదిపురుష్ టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 21.46 కోట్లు
సీడెడ్: 5.26 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.82 కోట్లు
తూర్పు: 3.72 కోట్లు
పశ్చిమ: 2.82 కోట్లు
గుంటూరు: 4.85 కోట్లు
కృష్ణ: 2.65 కోట్లు
నెల్లూరు: 1.30 కోట్లు
————————————————-
ఏపీ+తెలంగాణ= 47.88కోట్లు(74.75కోట్లు~ గ్రాస్)
————————————————-
కర్ణాటక: 7.60 కోట్లు
తమిళనాడు: 1.05 కోట్లు
కేరళ: 0.42 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 36.30 కోట్లు
OS – 16.25 కోట్లు
—————————————————
వరల్డ్ వైడ్ కలెక్షన్= 109.50కోట్లు(218.00కోట్లు~ గ్రాస్)
—————————————————
కాగా, 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ 2 డేస్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 132.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.