మలయాళం ఇండస్ట్రీ నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హనీ రోజ్ వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అంతకుముందు రెండు సినిమాలు చేసిన రాని గుర్తింపు బాలయ్య సరసన చేయగానే వచ్చేసింది. ఈ సినిమాలో బాలయ్యకు మరదలు పాత్రలో “మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయా” అంటూ చేసిన రచ్చ వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి .
అయితే విరసింహారెడ్డి సినిమా తర్వాత హాని రోజ్ కి బోలెడు సినిమాలో అవకాశాలు వచ్చాయి. కానీ అమ్మడు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది . ఈ క్రమంలోని ఎప్పుడూ ఒకే పాత్ర వేస్తూ ఉండడంతో హనీ రోజ్ గ్లామర్ డోస్ పెంచేయడానికి సిద్ధపడింది . ఇకపై చీరల్లో మెరవనని పూర్తిగా వెస్ట్రన్ వేర్ ..మోడరన్ డ్రెస్సులోనే మెరవాలని భావిస్తుందట . అప్పుడే తనకి గ్లామర్ డోస్ ఉన్న పాత్రలు డైరెక్టర్ లు సజెస్ట్ చేస్తారని ..
ఆ కారణంగానే ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకుందట హనీ రోజు . అమ్మడు ఎవరికోసం ఈ నిర్ణయం తీసుకున్న ..హాని రోజ్ తీసుకున్న డెసిషన్ కి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. నువ్వు కుమ్మేయ్.. ఇక తగ్గదు అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. చూడాలి మరి హనీ రోజు మోడరన్ డ్రెస్ అందాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో..? ఎలా ఉంటుందో..? డైరెక్టర్ ల ను ఎలా టెంప్ట్ చేస్తుందో..?