మెగామనవరాలికి మంచి అబ్బాయిని సెట్ చేసిన అభిమానులు.. పుట్టిన 24 గంటల్లోనే సంబంధం ఫిక్స్ చేసేసారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం.. భూతద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్ గానే మెగా కోడలు పిల్ల ఉపాసన పండు లాంటి పాపకి జన్మనిచ్చింది .

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఉపాసన పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా చరణ్ కి పాప పుట్టడంతో సరికొత్త విషయాన్ని ట్రెండ్ లోకి తీసుకొచ్చారు. మనకు తెలిసిందే అల్లు అర్జున్కి – అయ్యాన్ అనే బాబు ఉన్నాడు. ఇప్పుడు చరణ్ కి పాప పుట్టడంతో వాళ్ళిద్దరూ వరుసకి బావ మరదలు అవుతారు .

అయితే ఒకవేళ పెద్దలు ఒప్పుకొని వీళ్ళ పెళ్లి కుదిరితే మాత్రం ఇండస్ట్రీలో ఇది ఓ షాకింగ్ సంబంధం గా మారిపోతుందని .. ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా మిగిలిపోతుందని మళ్లీ అలు – మెగా బంధం పెన వేసుకుంటుంది అని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే పలువురు జనాలు బిడ్డ పుట్టి 24 గంటలు కాలేదు అప్పుడే మీ అభిమానం స్టార్ట్ చేసేసారా..? ఇదేం పైశాచికం ఆనందం రా బాబు అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి అల్లు అర్జున్ – చరణ్ మధ్య రిలేషన్షిప్ వైరల్ గా మారింది..!!